Header Banner

సింగపూర్ లో ఘనంగా ఉగాది వేడుకలు.! దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు..

  Wed Apr 02, 2025 15:27        Singapore

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు మరియు ప్రఖ్యాత రచయిత అయిన డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్సభ సభ్యులు డి కె అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.

 

సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి ఉగాది మరియు సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై కలసి ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.

 

కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు అయిన కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "ఉగాది పర్వదిన సందర్భంగా సింగపూర్ లో ఉన్న తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించడానికి ఇటువంటి వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి మా ప్రయత్నాన్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది" అని తెలియజేశారు.

 

సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife" మరియు రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు కూడా ఈ వేదికపై ఆవిష్కరించబడ్డాయి. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.

 

ఇది కూడా చదవండి: సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫ్రెండ్లీ స్ట్రీట్స్! వారికి మరిన్ని సౌకర్యాలతో!

 

సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు.

 

కార్యక్రమ ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఏదైనా దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుందని, దూరంలో ఉన్నప్పుడే మన సంస్కృతి భాష యొక్క ప్రాధాన్యత అర్థమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమని తెలియచేస్తూ, ఈ కారణం చేస్తా ప్రపంచములో త్వరితగతిన  అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించి అందరికి స్ఫూర్తిని కలిగించారు.

 

కార్యక్రమ విశిష్ట అతిథు డి కె అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

 

కార్యక్రమ ఆత్మీయ అతిధి  వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.

 

ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.

 

స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు.

 

కార్యక్రమ చివరిలో నిర్వాహుకులు అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న మరియు వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Singpore #FestivalCelebrations #Indians #ugadhi